CM Chandrababu: అనంతపురం జిల్లా ఘటనపై చంద్రబాబు సీరియస్..
ABN, Publish Date - Jun 10 , 2025 | 04:07 PM
ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియన్ అయ్యారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
అమరావతి, జూన్ 10: ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలపై చేయి వేయాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకురావాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న రెండు అత్యాచార ఘటనలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారం కేసులకు సంబంధించి విచారణ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పక్కా ఆధారాల సేకరణతో నిర్దిష్ట సమయంలో నిందితులకు శిక్షపడేలా చూడాలని ఆదేశించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానని, గంజాయి బ్యాచ్ ఆట కట్టించాలని స్పష్టం చేశారు. ఇక ఈ రెండు ఘటనల్లో దర్యాప్తు, చర్యల వివరాలను సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా డీజీపీ, ఉన్నతాధికారులు వివరించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలంలో ఎనిమిదో తరగతి చదువుతున్న దళిత బాలికపై రెండేళ్లుగా అత్యాచారం జరుగుతోంది. యువకుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ చిన్నారిపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆరుగురు నిందితులను మంగళవారం నాడు అచ్చంపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారిని సైతం త్వరలో అరెస్ట్ చేస్తామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు. అలాగే బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామన్నారు. చిన్నారికి పూర్తి భద్రత కల్పించామని ఎస్పీ రత్న స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
కొమ్మినేని శ్రీనివాస్‌కు రిమాండ్
చెల్లినే వదలలేదు.. మహిళలకు ఏం గౌరవం ఇస్తారు: షర్మిల
Read latest AP News And Telugu News
Updated Date - Jun 10 , 2025 | 05:52 PM