CII Summit: నవంబరులో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్
ABN, Publish Date - Jul 10 , 2025 | 05:33 AM
వచ్చే నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ర్టీ సీఐఐ..
విశాఖలో సన్నాహక ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): వచ్చే నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ర్టీ(సీఐఐ) 30వ భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం (పార్టనర్‌షిప్ సమ్మిట్) జరగనున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన సన్నాహాక ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సీఐఐ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు, పలు శాఖ ఉన్నతాధికారులు సహా, భారత పరిశ్రమల సమాఖ్య, తదితర సంస్థలకు చెందిన అధిక సంఖ్యలో ప్రతినిధులు పాల్గొనేందుకు సన్నాహాలు ప్రారంభించి, పటిష్ఠ ఏర్పాట్లు చేయాలన్నారు. పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ మాట్లాడుతూ ఈ నెల 16న జరిగే రెండో సమావేశం నాటికి సమ్మిట్ లోగా, వివిధ ప్రచార సామగ్రి సిద్ధం చేయనున్నట్లు చెప్పారు.
Updated Date - Jul 10 , 2025 | 05:33 AM