ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Land: భూ ఆక్రమణ

ABN, Publish Date - Jun 30 , 2025 | 01:59 AM

గుట్టలపై ఆక్రమణదారు కన్నుపడింది. ఇలా రిజర్వు ఫారెస్టులో ఎక్స్‌కవేటరుతో చదును చేసి ఆక్రమణకు మొదలు పెట్టారు చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన వ్యక్తి.

రిజర్వు ఫారె్‌స్టలో చదును చేసిన భూమి

చంద్రగిరి, ఆంధ్రజ్యోతి: ప్రభుత్వ, డీకేటీ భూముల అయిపోయినట్లున్నాయి. గుట్టలపై ఆక్రమణదారు కన్నుపడింది. ఇలా రిజర్వు ఫారెస్టులో ఎక్స్‌కవేటరుతో చదును చేసి ఆక్రమణకు మొదలు పెట్టారు చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన వ్యక్తి. ఆ గ్రామానికి సమీపం, ప్రధాన రహదారికి ఆనుకొని అనుప్పల్లి- చంద్రగిరి రహదారి పక్కనే రిజర్వు ఫారెస్ట్‌ ఉంది. ఆ అటవీ ప్రాంతాన్ని మూడు రోజులుగా రాత్రి వేళల్లో ఎక్స్‌వేటర్‌తో చదును చేస్తున్నారాయన. తమ పశువులు, గొర్రెలు, మేకలు మేపుకోవడానికి కనీసం రిజర్వు ఫారె్‌స్టనూ వదలకుండా కబ్జా చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై సంబంధిత అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఆ దారిలో భూముల విలువ విపరీతంగా ఉండటంతో కబ్జాదారుడు ఏకంగా రిజర్వు ఫారె్‌స్టనే ఆక్రమించే పనిలో పడ్డారు. ఇప్పటికే సుమారు రెండు ఎకరాలు చదును చేఇనట్లు సమాచారం. రిజర్వు ఫారెస్ట్‌ నుంచి గ్రామస్తులు పొయ్యిలోకి ఎండు కట్టెలను తీసుకొస్తేనే పట్టుకునే అధికారులు.. ఇప్పుడు ఏకంగా భూమినే చదును చేస్తుంటే పట్టించుకోకపోవడం ఏంటని స్థానికులు నిలదీస్తున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 01:59 AM