Home » Chandragiri
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీప ప్రాంతాల్లో ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనను ఎంపిక చేయటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కష్టపడతానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
చంద్రగిరి మండలం, ఎగువ కూచివారిపల్లె పంట పొలాల్లో పగలు కూడా ఏనుగులు తిష్ట వేస్తున్నాయి. దీంతో రైతులు విలవిలలాడిపోతున్నారు.
శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వైసీపీ నాయకుడికి తిరుపతి ఆర్‌ఎస్‌ఎస్ ఏడీజే కోర్టు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లతో కలకలం రేగింది. సోమవారం అర్ధరాత్రి కోట పడమర ప్రవేశ ద్వారం వద్ద నడిరోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి వింత ఆకృతులతో ముగ్గులు వేసి ఉన్నారు.
తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం చంద్రగిరి మండలం రాయలపురం గ్రామంలో శనివారం నిర్వహించారు.
స్వర్ణ చంద్రగిరి ప్రాజెక్టు అమలు దిశగా అడుగులు పడుతున్నాయి.
స్వర్ణనారావారిపల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరికి సీఎం చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. స్వర్ణకుప్పం, నారావారిపల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ చంద్రగిరి మండలాన్ని తీర్చిదిద్దనున్నారని చెప్పారు.
గుట్టలపై ఆక్రమణదారు కన్నుపడింది. ఇలా రిజర్వు ఫారెస్టులో ఎక్స్‌కవేటరుతో చదును చేసి ఆక్రమణకు మొదలు పెట్టారు చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన వ్యక్తి.
చంద్రగిరి పరిసర ప్రాంతాల నుంచి భారీగా ఎద్దులను తీసుకొచ్చారు. వాటి కొమ్ములు చెలిగి, రంగులు వేసి, కొప్పులను తొడిగి, రాజకీయ నాయకులు, సినీనటులు, దేవుళ్ల ఫొటోలు..