చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల కలకలం
ABN , Publish Date - Mar 25 , 2026 | 01:47 PM
చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లతో కలకలం రేగింది. సోమవారం అర్ధరాత్రి కోట పడమర ప్రవేశ ద్వారం వద్ద నడిరోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి వింత ఆకృతులతో ముగ్గులు వేసి ఉన్నారు.
చంద్రగిరి(తిరుపతి): చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లతో కలకలం రేగింది. సోమవారం అర్ధరాత్రి కోట పడమర ప్రవేశ ద్వారం వద్ద నడిరోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి వింత ఆకృతులతో ముగ్గులు వేసి ఉన్నారు. కోటకు సెక్యూరిటీ సిబ్బంది ఉండగా నడిరోడ్డుపై పూజలు ఎలా చేశారనే అనుమానం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. గతంలో కూడా గుప్తనిధుల కోసం అనేకమంది పూజలు చేసి వుండడంతో ఈ విషయాన్ని పురావస్తుశాఖ అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:
ఓఆర్‌ఆర్ చుట్టూ ఆధునిక బస్టాండ్లు, టెర్మినళ్లు
విజయ్ వాహనాన్ని అనుసరిస్తూ గాయపడిన యువకుడి మృతి
Read Latest Telangana News and National News