బ్యాంకుల ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ నెలలో సెలవులు ఇవే..
ABN , Publish Date - Mar 25 , 2026 | 07:47 AM
ఏప్రిల్ 1న బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు సందర్భంగా సెలవు ఉండనుంది. ఏప్రిల్ 2న మౌనీ గురువారం సందర్భంగా కేరళలో సెలవు ఉండనుంది. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
బిజినెస్ న్యూస్: నూతన సంవత్సరం(2026) వచ్చి ఇంకో ఐదు రోజులకు మూడు నెలలు పూర్తి కానుంది. మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల రానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల ఖాతాదారులకు బిగ్ అలర్ట్. 2026 ఏప్రిల్ నెలలో పలు పండుగలు, ప్రత్యేకమైన రోజుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. సాధారణ సెలవులతోపాటు కొన్ని రోజులు దేశవ్యాప్తంగా సెలవులు ఉండగా.. మరికొన్ని రోజులు రాష్ట్రాల వారీగా మాత్రమే ఉండనున్నాయి. ఈ మేరకు కస్టమర్లు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే నెలలో ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏప్రిల్ నెల సెలవులు ఇవే..
ఏప్రిల్ 1న బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు (Closing of Accounts) సందర్భంగా సెలవు ఉండనుంది. ఏప్రిల్ 2న మౌనీ గురువారం సందర్భంగా కేరళలో సెలవు ఉండనుంది. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైశాఖి వంటి పండుగల నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక, ఏప్రిల్ 15న బెంగాలీ నూతన సంవత్సరం, విషు, బోహాగ్ బిహు వంటి పండుగల కారణంగా త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
ఏప్రిల్ 16న అస్సాంలో బిహు పండుగ సందర్భంగా సెలవు ఉండనుంది. మరోవైపు కర్ణాటకలో బసవ జయంతి, అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 20న బ్యాంకులు మూతపడనున్నాయి. ఏప్రిల్ 21న త్రిపురలో గరియా పూజ సందర్భంగా సెలవు ప్రకటించారు. అలాగే ఆదివారాలు 5, 12, 19, 26 తేదీల్లోనూ బ్యాంకులకు సెలవు ఉండనుంది. 11, 25 తేదీల్లో రెండు, నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవులు రానున్నాయి. ఆయా తేదీలను గమనించి బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవడం మంచిది. అయితే, ఈ రోజుల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు సాధారణంగా కొనసాగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు