ఏడుగురు ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్‌కు నోటీసులు
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:50 PM
పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్, మార్చి 25: పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ అంశంపై ఈ రోజు విచారణ జరిగింది. దాంతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన జాబితాలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు ఉన్నారు. ఏప్రిల్ 16వ తేదీ ఈ కేసు విచారణను వాయిదా వేసింది.
హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్..
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పిటిషనర్లు స్పష్టం చేశారు. వారంతా బహిరంగంగానే కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్ల తరఫు న్యాయవాది. అన్ని మీడియాల్లోనూ వీరు కండువా కప్పుకున్న దృశ్యాలు వచ్చాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు చెబితేనే స్పీకర్ స్పందిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరితే.. ఏడాది పాటు ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే స్పీకర్ స్పందించారని కోర్టుకు వివరించిన పిటిషనర్ న్యాయవాది. ఈ నేపథ్యంలో పర్సనల్ నోటీస్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలన్న కోర్టు పిటిషనర్ న్యాయవాది కోరారు. దాంతో వారికి స్పీడ్ పోస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆయిల్ ఫామ్‌కు అనువైన తెలంగాణ నేల: మంత్రి తుమ్మల
ఐకానిక్ టవర్ల నిర్మాణం పనులు వేగవంతం: మంత్రి నారాయణ
For More TG News And Telugu News