ఆయిల్ ఫామ్‌కు అనువైన తెలంగాణ నేల: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:20 PM
పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్‌కు అనువైన ప్రాంతం తెలంగాణ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్, మార్చి 25: పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్‌కు అనువైన ప్రాంతం తెలంగాణ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ పంటకు అనుకూలంగా ఉందని మంత్రి తుమ్మల వివరించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానం ఇచ్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంట వివరాలు సేకరిస్తామని పేర్కొన్నారు. దీనిపై త్వరలో ఒక ప్రకటన చేస్తామని మంత్రి తుమ్మల వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐకానిక్ టవర్ల నిర్మాణం పనులు వేగవంతం: మంత్రి నారాయణ
యుద్ధం ఎఫెక్ట్.. మూతబడుతున్న పెట్రోల్ బంక్‌లు
For More TG News And Telugu News