యుద్ధం ఎఫెక్ట్.. మూతబడుతున్న పెట్రోల్ బంక్‌లు
ABN , Publish Date - Mar 25 , 2026 | 08:40 AM
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే నగరంలో గ్యాస్ కష్టాలు మొదలైన విషయం తెలిసిందే.
గ్యాస్ ఏజెన్సీలో నో స్టాక్ బోర్డు
ఆందోళనలో ప్రజలు
సికింద్రాబాద్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే నగరంలో గ్యాస్ కష్టాలు మొదలైన విషయం తెలిసిందే. తాజాగా పెట్రోలియం కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేక మూతబడుతున్నాయి. ప్యాట్నీ సెంటర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంకు యజమానులు పెట్రోలియం కంపెనీలకు ముందుగానే డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరా లేక ఐదు రోజులుగా బంక్‌ను మూసివేశారు. అదే విధంగా గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు నిలిచిపోయాయి.
బొల్లారం స్నేహా కాలనీ(Bollaram Sneha Colony)లోని సాయి ప్రియ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం మంగళవారం నో స్టాక్ బోర్డును ఏర్పాటు చేశారు. ఓ వైపు గ్యాస్, మరోవైపు పెట్రోల్ బంక్‌లు మూతపడుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుని తమ ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఓఆర్‌ఆర్ చుట్టూ ఆధునిక బస్టాండ్లు, టెర్మినళ్లు
Read Latest Telangana News and National News