హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తాం
ABN , Publish Date - Mar 25 , 2026 | 07:55 AM
హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే నగరాభివృద్ధికి రూ.15వేల కోట్లకు పైగా నిధుల మంజూరుకు అనుమతులు ఇచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే నగరాభివృద్ధికి రూ.15వేల కోట్లకు పైగా నిధుల మంజూరుకు అనుమతులు ఇచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) అన్నారు. జంట నగరాల అభివృద్ధి విషయంలో రాజీపడేదిలేదని స్పష్టం చేశారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, సహా తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్(BRS) హయాంలో 9 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి రూ.5,790కోట్లే ఖర్చు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో నగరంలో రూ.7,032కోట్ల అంచనాతో హెచ్-సిటీ కింద దాదాపు 26 పనులు మంజూరు చేశామని వెల్లడించారు. అలాగే రూ.1500 కోట్ల వ్యయంతో 49 లింక్ రోడ్లను మంజూరు చేశామని, రూ.7,46కోట్ల వ్యయ అంచనాతో 3 ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణాలను చేపట్టామన్నారు.
ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రధాన మార్గాలను మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించామని, అందుకు జీహెచ్‌ఎంసీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలను రూపొదించిందని, దానిని అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సుచిత్ర-మేడ్చల్ ఫ్లైఓవర్ పనులు, ఉప్పల్ కారిడార్ పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
941 కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్
Read Latest Telangana News and National News