ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Mar 25 , 2026 | 06:37 AM
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
పంజాగుట్ట(హైదరాబాద్): గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11కేవీ భరత్ నగర్ ఫీడర్ పరిధిలోని హెచ్‌పీ రోడ్డు, లక్ష్మీకళ, శ్రీరాములు థియేటర్లు, అశ్విని హెయిర్ ఆయిల్ లైన్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
సైదాబాద్: మరమ్మతుల కారణంగా ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని డీఈ విష్ణువర్ధన్‌రెడ్డి(DE Vishnuvardhan Reddy) తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హరిహర క్షేత్రం, జీఎం నగర్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల వరకు దోబీఘాట్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు శాలివాహన నగర్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, దిల్‌సుఖ్‌నగర్ ఫీడర్ల పరిధిల్లోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని డీఈ పేర్కొన్నారు.
గాజులరామారం: గాజులరామారం సబ్-స్టేషన్ పరిధిలోని 33/11కేవీ విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్న 3 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ఏఈ చైతన్య భార్గవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రోడా మిస్త్రీనగర్, హజీ, అల్లీ మసీదు లైన్, ఎస్సీబీ నగర్, వివేకానంద్ నగర్, శ్రీని వాసనగర్, ఇందిరానగర్-ఏ,బి, ఉషోదయాకాలనీ ఫేజ-1, ఎంఎఫ్ ఫంక్షన్‌హాల్, ఉషోదయా కాలనీ మెయిన్ రోడ్డు, బాలాజీ లే-అవుట్, శ్రీవెన్ ఎన్‌క్లేవ్ మెయిన్ రోడ్డు, జహంగీర్ బస్తీ, వీఎస్ఆర్ అపార్టుమెంట్, గాజులరామారం మెయిన్ రోడ్డులో కరెంట్ సరఫరా ఉండదని ఏఈ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
941 కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్
Read Latest Telangana News and National News