కసిరెడ్డి బెయిల్‌పై వాదనలు పూర్తి.. 30న నిర్ణయం
ABN , Publish Date - Mar 25 , 2026 | 06:00 AM
మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై...
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో ఈ నెల 30వ తేదీన నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ప్రకటించారు. కసిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే, సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.