Share News

ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

ABN , Publish Date - Mar 25 , 2026 | 07:31 AM

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటి ‘సూపర్ మ్యాన్’ఫేం వాలెరీ పెర్రీస్ కన్నుమూసిన విషయం మర్చిపోక ముందే మరో యువ నటి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.

ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి
Harshil Kalia Passed away,

ఇంటర్నెట్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ నటి ‘సూపర్ మ్యాన్’ఫేం వాలెరీ పెర్రీస్ కన్నుమూసిన విషయం మర్చిపోక ముందే రాజస్థాన్‌కు చెందిన యువనటి, ప్రముఖ మోడల్ హర్షిల్ కాలియా(30) రోడ్డు ప్రమాదంలో మరణించారు. రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో హర్షిల్ కాలియా పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది, ఆ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు వెంటనే వాహనం వద్దకు చేరుకుని కాలియాను రక్షించి ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హర్షిల్ కాలియా, 'క్రైమ్ నెక్స్ట్ డోర్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఆమె ఒక న్యూస్ ఛానెల్‌కు యాంకర్‌గా కూడా పనిచేశారు. పలు ప్రైవేట్ సాంగ్స్‌లో నటించారు. హర్షిల్ కాలియా మరణవార్త విని టీవీ, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

జోరుమీదున్న జాన్వీ.. వ‌రుస‌బెట్టి సినిమాలు

Updated Date - Mar 25 , 2026 | 07:44 AM