Share News

విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:15 PM

విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను అభినందించారు.

విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను అభినందించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు. సీపెక్ సర్వే ప్రకారం రూ. 5 లక్షల బీమా ఆయా కుటుంబాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడొద్దనే భావనతో కుటుంబ బీమా తీసుకొచ్చామని అన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. విద్యుత్, సింగరేణి కార్మికులకు రూ. కోటి పైన ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


భారీ ఆర్థికసాయం..

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయాన్ని తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అందజేశారు. ఉద్యోగుల భద్రతకు, వారి కుటుంబాల భరోసాకు ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్, సింగరేణి కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్రమాద బీమా పథకం కింద భారీ మొత్తాన్ని అందజేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తూ మరణించిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఓర్సు సురేశ్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఉద్యోగి. ముక్తార్ బేగ్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉద్యోగి. వీరి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున బీమా చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన

బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 23 , 2026 | 03:37 PM