బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Mar 22 , 2026 | 10:09 AM
బిల్డింగ్ రూల్స్‌లో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. టీడీఆర్ వినియోగంపై రేవంత్‌రెడ్డి సర్కార్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
హైదరాబాద్, మార్చి22 (ఆంధ్రజ్యోతి): బిల్డింగ్ రూల్స్‌లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక మార్పులు చేసింది. టీడీఆర్ వినియోగంపై రేవంత్‌రెడ్డి సర్కార్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హైరైజ్‌గా గుర్తించింది. 750 నుంచి 2000 చదరపు మీటర్ల ప్లాట్లలో 18 నుంచి 21 మీటర్ల భవనాలకు టీడీఆర్ తప్పనిసరిగా చేసింది. నాన్ హైరైజ్ బిల్డింగ్స్‌కు టీడీఆర్ ద్వారా సెట్‌బ్యాక్ సడలింపులు చేసింది. హైరైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్‌కు అనుమతి ఇచ్చింది. 2000 చదరపు మీటర్లకు పైగా ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం కల్పించింది.
40 ఫీట్ రోడ్ వద్ద 3 అదనపు అంతస్తులకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. 60 ఫీట్ రోడ్ వద్ద 4 అదనపు అంతస్తులకు అనుమతిచ్చింది. 80 ఫీట్ రోడ్ వద్ద 5 అదనపు అంతస్తులకు అనుమతి ఇచ్చింది. 10 అంతస్తులకు పైగా భవనాల్లో టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేసింది. 20 అంతస్తులకుపైగా ఉన్న భవనాలకు 5 శాతం టీడీఆర్ లోడింగ్ కల్పించింది. బిల్డింగ్ అనుమతి సమయంలో 50 శాతం టీడీఆర్ సమర్పణ తప్పనిసరి చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌కు ముందు మిగతా 50 శాతం టీడీఆర్ సమర్పణ తప్పనిసరి అని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్
మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News