Home » Petrol Pumps
రిటెయిల్ పెట్రోల్ బంకుల్లో కమర్షియల్ కొనుగోళ్లపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జులై 1 నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొంది.
బల్క్ పెట్రోల్ కొనుగోళ్లపై ఆంక్షలతో ఇబ్బందులు తలెత్తుతాయని ఆసుపత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆంక్షల నుంచి మినహాయింపు కావాలని ఐటీ, టెలికం సేవల సంస్థలు కూడా కోరుతున్నాయి.
వాహనదారులకు ఈ ఉదయాన్నే మరో గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన పంపిణీ సంస్థలు కంప్రెస్‌డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోగ్రాముకు రూ. 2 మేర పెంచాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై భారం మరింత పెరిగింది. తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు ప్రకటించాయి.
మృతదేహం లైన్‌లో ఉండడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన కొరత చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా పక్కకు నెట్టింది.
పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను భారత ప్రభుత్వం సవరించింది, అయినప్పటికీ వినియోగదారులకు రిటైల్ పెట్రో ధరలు యథాతథంగా ఉంటాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు మరోసారి పరుగులు పెట్టారు. ఒక బంకు వద్ద నుంచి మరో చోటుకు లగెత్తారు.
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృస్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల డిస్ర్టిబ్యూటర్లను హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా ఎదురైన పెట్రోల్, డీజిల్ కొరత సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 7 గంటల సమయానికి రాష్ట్రంలోని సుమారు 90 శాతం పెట్రోల్ బంకుల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు వెల్లడించారు.