Home » Iraq
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడికి దిగిన నేపథ్యంలో, దానికి ప్రతికారంగా యూఎస్ మిలిటరీ.. ఇరాన్‌లోని లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
ఉత్తర ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంత రాజధాని ఎర్బిల్‌లో తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. అమెరికా కాన్సులేట్ సమీపం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు ప్రయోగించింది.
ఇరాక్‌కు చెందిన సాయుధ బృందం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చిన వారికి 10 మిలియన్ అమెరికన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది.
ఇరాక్‌లోని పశ్చిమ ఎడారి ప్రాంతంలో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి చోట స్థానిక గొర్రెల కాపరి ఏదో అసాధారణమైనదాన్ని గమనించాడు. హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయి. మారుమూల ప్రాంతంలో వింత కార్యకలాపాలు జరుగుతున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ జనజీవనం స్తంభించిపోయింది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇరానీయులు సరిహద్దులు దాటి దక్షిణ ఇరాక్‌లోకి ప్రవేశిస్తున్నారు.
ఇరాన్ ప్రభుత్వ మీడియా సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక వ్రాతపూర్వక సందేశాన్ని విడుదల చేసింది. సదరు సందేశంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు, అక్కడి మత పెద్దలకు మొజ్తబా కృతజ్ఞతలు చెప్పినట్టుంది. అయితే, మొజ్తబా మాట్లాడిన వీడియో లేదా, ఆడియో బయటకు రాలేదు.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలు క్రమంగా ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ అధ్యక్షుడు నెచిర్వాన్ బార్జానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదని సమాచారం.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే నగరంలో గ్యాస్ కష్టాలు మొదలైన విషయం తెలిసిందే.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి జరిపింది. శనివారం ఉదయం భారీ పేలుడు అనంతర అమెరికా ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్టు అధికారులు తెలిపారు.
దుబాయ్‌లోని అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి ప్రముఖ బుర్జ్ ఖలీఫాపై కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగం జరిగింది. అయితే ఆ భవనంకి ఎలాంటి ముప్పు వాటిల్ల లేదు. ఒకవేళ...