Share News

ఇంటర్నెట్, నిత్యావసరాల కోసం ఇరాక్‌లోకి ఇరాన్ పౌరులు..

ABN , Publish Date - Mar 30 , 2026 | 07:12 AM

అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ జనజీవనం స్తంభించిపోయింది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇరానీయులు సరిహద్దులు దాటి దక్షిణ ఇరాక్‌లోకి ప్రవేశిస్తున్నారు.

ఇంటర్నెట్, నిత్యావసరాల కోసం ఇరాక్‌లోకి ఇరాన్ పౌరులు..
Iranians crossing into Iraq

అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ జనజీవనం స్తంభించిపోయింది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఇంటర్నెట్ నిలిచిపోవడం, వాణిజ్యం స్తంభించడం మొదలైన సమస్యలు అక్కడ సర్వ సాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కొందరు ఇరానీయులు సరిహద్దులు దాటి దక్షిణ ఇరాక్‌లోకి ప్రవేశిస్తున్నారు (Iranians crossing into Iraq).


తక్కువ ధరకు లభించే సరుకుల కోసం, ఇంటర్నెట్ కోసం ఇరాన్ పౌరులు తమ జీవితాలను రిస్క్‌లో పెట్టి మరీ ఇరాక్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఎక్కువ మంది బస్రాలోని షాలమ్చే క్రాసింగ్ ద్వారా ఇరాక్‌లోకి ప్రవేశిస్తున్నారు. చౌక ధరల్లో సరకులు దొరకడం, ఇంటర్నెట్ సదుపాయం ఉండడంతో పాటు బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకునేందుకు చాలా మంది ఇరాక్‌లోకి ప్రవేశిస్తున్నారు (Iran war civilian impact).


కొన్ని రోజులుగా నిరంతర వైమానిక దాడులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని (Iraq border crossings), పేలుడు శబ్దాలతో ఇళ్లు ధ్వంసం కావడంతోపాటు పిల్లలు భయాందోళనలకు గురవుతున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌లో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి జీవన పరిస్థితులు క్షీణిస్తున్నాయన్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించాలని వేడుకుంటున్నారు.


ఈ వార్తలూ చదవండి:

గర్భధారణపై మైక్రోగ్రావిటీ ప్రభావం.. శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే..

జుట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు.. వీడియో వైరల్

Updated Date - Mar 30 , 2026 | 08:46 AM