Share News

జుట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:13 AM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ విద్యాసంస్థ ‘'గల్గోటియాస్ విశ్వవిద్యాలయం' మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు విద్యార్థునుల మధ్య జరిగిన వాగ్వాదం.. చివరకు ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకునే స్థాయికి చేరింది.

జుట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు.. వీడియో వైరల్

గ్రేటర్ నోయిడా, మార్చి29: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని ప్రముఖ విద్యాసంస్థ 'గల్గోటియాస్ విశ్వవిద్యాలయం' (Galgotias University) మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరు విద్యార్థునుల మధ్య జరిగిన వాగ్వాదం.. చివరకు ఒకరిపై ఒకరు భౌతిక దాడి చేసుకునే వరకూ చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వైరల్ అవుతున్న వీడియోలో.. గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇద్దరు అమ్మాయిల మధ్య చిన్న వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఇద్దరూ మాటల యుద్ధానికి దిగారు. ఆగ్రహంతో ఒకరినొకరు చెంప దెబ్బలు కొట్టుకుంటూ, జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. కొంతమంది విద్యార్థినులు ఆ ఇద్దరినీ విడదీయడానికి ప్రయత్నించగా.. మరికొంతమంది ఆ గొడవను ఫోన్లలో వీడియోలు తీశారు. అయితే ఈ ఘటనపై విశ్వవిద్యాలయ అధికారులు ఇంతవరకూ స్పందించలేదు.

ఈ వీడియోను @gharkekalesh అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.‘గల్గోటియా పేరును చెడగొడుతున్నారు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘ కొంపదీసి ఇద్దరి బాయ్ ఫ్రెండ్ ఒక్కడేనా?’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘గల్గోటియాస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కంటే ఎక్కువ వినోదం పంచుతోంది’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..

ఇరాన్‌పై భూతల దాడులు చేసే ఉద్దేశం లేదు.. అమెరికా విదేశాంగ మంత్రి..

Updated Date - Mar 29 , 2026 | 07:29 AM