Share News

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:26 PM

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చర్చ జరిగింది. గత మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఇరాన్ విషయమై చర్చించారు.

మోదీ-ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్.. కేంద్ర ప్రభుత్వం స్పందన ఏంటంటే..
Elon Musk Modi Trump call

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చర్చ జరిగింది. గత మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఇరాన్ విషయమై చర్చించారు. అయితే, ఈ కాల్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా పాలు పంచుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్‌లో తాజాగా ఒక కథనం ప్రచురితమైంది. ఆ కథనాలపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది (Elon Musk Modi Trump call).


'ఆ కథనం మా దృష్టికి వచ్చింది. మార్చి 24వ తేదీన మోదీ, ట్రంప్ మాత్రమే ఫోన్‌లో మాట్లాడుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి వారిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు' అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఘర్షణలపై ట్రంప్, మోదీలు తొలిసారిగా గత మంగళవారం మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన అవసరం గురించి ట్రంప్‌తో మోదీ మాట్లాడారు. ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి, ఆర్థికాభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు (India rejects NYT report).


ఇరాన్ యుద్ధం గురించి ఇద్దరు దేశాధి నేతల మధ్య చర్చలో ఒక ప్రైవేటు వ్యక్తి పాలుపంచుకోవడం అసాధారణ విషయమని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది (Modi Trump phone call). కొందరు అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. ట్రంప్, మస్క్‌ మధ్య సయోధ్య కుదిరినట్టే అన్న విషయాన్ని ఈ పరిణామం రుజువు చేస్తోందని కూడా న్యూయార్క్ టైమ్స్ కామెంట్ చేసింది. అయితే ఆ కథనం పూర్తిగా అసత్యమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

Updated Date - Mar 28 , 2026 | 05:26 PM