గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
ABN , Publish Date - Mar 28 , 2026 | 03:41 PM
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట లభించింది. తన పేరును వాడుకుంటూ ఏఐ జనరేటెడ్ వీడియోలు తీశారని గంభీర్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట లభించింది. తన పేరును వాడుకుంటూ ఏఐ జనరేటెడ్ వీడియోలు తీశారని గంభీర్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శనివారం ఢిల్లీ హైకోర్టు ఈ అంశంపై విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది. గంభీర్ పేరు, ఫొటో, వాయిస్ లేదా ఏఐ జనరేటెడ్‌తో కూడిన వీడియోలను 36 గంటల్లో తొలగించాలని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం తీర్పునిచ్చింది.
గంభీర్ తరఫున న్యాయవాదులు పలు సోషల్ మీడియా ఖాతాలను కోర్టు ముందుంచారు. ఆన్‌లైన్ అతడి గుర్తింపును దుర్వినియోగం చేసినట్లు వాదనలు వినిపించారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాల్లోని కంటెంట్‌ను 36 గంటల్లో తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. మున్ముందు ఇలాంటి అవాంఛిత కంటెంట్ ఆయా ఖాతాల్లో రాకుండా చూడాలని హెచ్చరించింది. ఉల్లంఘనకు పాల్పడిన బాధ్యుల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. భారత క్రికెట్‌కు ప్రధాన కోచ్‌గా ఉన్న గంభీర్ తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించే హక్కును కాలరాయడం తగదని హైకోర్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: అరుదైన రికార్డు కోసం సిద్ధమైన ఇషాన్ కిషన్..
ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బిగ్ షాక్