ఐపీఎల్ 2026: అరుదైన రికార్డు కోసం సిద్ధమైన ఇషాన్ కిషన్..
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:54 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం మ్యాచ్‌లో భాగంగా ఇవాళ(శనివారం) చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేకుండానే ఈ కొత్త సీజన్‌ను ఎస్ఆర్‌హెచ్ ప్రారంభించనుంది.
స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభం మ్యాచ్‌లో భాగంగా ఇవాళ(శనివారం) చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ లేకుండానే ఈ కొత్త సీజన్‌ను ఎస్ఆర్‌హెచ్ ప్రారంభించనుంది. కమిన్స్ స్థానంలో యువ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ నాయకత్వం వహించనున్నాడు. ఇవాళ ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్ ఇషాన్ కిషన్‌కు ఒక చారిత్రాత్మక మైలురాయి కానుంది. అంతేకాక ఐపీఎల్ చరిత్రలోనే తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కు చాలా మంది భారత ప్లేయర్లు కెప్టెన్లుగా చేశారు. గతంలో శిఖర్ ధావన్ , మనీష్ పాండే, భువనేశ్వర్ కుమార్ వంటి ఇతర ఇండియన్ ప్లేయర్లు ఎస్ఆర్‌హెచ్‌కు నాయకత్వం వహించారు. ఇవాళ్టి మ్యాచ్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన తొలి భారత కెప్టెన్‌గా మాత్రం ఇషాన్ కిషన్ నిలవనున్నాడు. 27 ఏళ్ల 253 రోజుల వయస్సులో ఎస్ఆర్‌హెచ్‌కు ఇషాన్ కెప్టెన్ అయ్యాడు. అయితే ఎస్ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు మాత్రం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ పేరిట ఉంది. అతడు 2018 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో విలియమ్సన్ వయసు 27 ఏళ్ల 244 రోజులు.
అతడి తర్వాత ఎస్ఆర్‌హెచ్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహించిన రెండవ అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా ఇషాన్ నిలవనున్నాడు. ఎస్ఆర్‌హెచ్‌కు నాయకత్వం వహించిన అత్యంత పిన్న వయస్కుడైన తొలి భారత కెప్టెన్‌గా మాత్రం ఇషాన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. మరోవైపు కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించాలన్న జట్టు నిర్ణయంపై ప్రధాన కోచ్ డేనియల్ వెట్టోరి విశ్వాసం వ్యక్తం చేశారు. అతను ఆత్మవిశ్వాసం గల ఆటగాడిగా, ఇప్పటికే అతను వేరే టోర్నీల్లో కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకున్నందున, అతనికి ఆ బాధ్యతను అప్పగించడంలో యాజమాన్యానికి పెద్దగా సంకోచం లేదని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: కొన్ని గంటల్లో తొలి మ్యాచ్ ప్రారంభం.. అభిమానులకు గుడ్‌న్యూస్
ఐపీఎల్ 2026: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు బిగ్ షాక్