ఐపీఎల్ 2026: కొన్ని గంటల్లో తొలి మ్యాచ్ ప్రారంభం.. అభిమానులకు గుడ్‌న్యూస్
ABN , Publish Date - Mar 28 , 2026 | 10:50 AM
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య తొలి సమరం ప్రారంభం కానుంది.
స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్(IPL) 2026 సీజన్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్(SRH VS RCB) మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్ తెరలేవనుంది. తొలి మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ కావడంతో భారీ స్కోర్ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈసారి వరుణుడు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుసున్నాయి. నిన్న(శుక్రవారం) రాత్రి హైదరాబాద్‌లో వాన దంచికొట్టింది. ఈక్రమంలో తొలి మ్యాచ్ జరిగే బెంగళూరు కూడా వర్షం పడుతుందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగే అవకాశం లేదని బెంగళూరు వాతావరణ శాఖ పేర్కొంది. బెంగళూరులో తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది.
ఆకాశం నిర్మలంగా ఉంటుందని, గాలిలో తేమ ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. ఇది అభిమానులకు గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశముందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నస్వామి స్టేడియంలో బౌండరీల దూరం తక్కువగా ఉండడంతో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. 2025లో ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మరోసారి కప్‌ను ముద్దాడాలనే పట్టుదలతో ఉంది.
ఇరు జట్లు
ఆర్సీబీ:
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి , దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్య , స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసీ షర్మా దయాల్, భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్, జాకబ్ డఫీ, సాత్విక్ దేశ్వాల్, మంగేశ్ యాదవ్, జోర్డాన్ కాక్స్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్,యశ్ దయాల్
ఎస్ఆర్‌హెచ్:
ఇషాన్ కిషన్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, ఆర్. స్మరన్, హెన్రిచ్ క్లాసెన్, హర్ష్ దూబే, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్ , శివన్ కుమార్ అన్ద్కత్, ఎషన్ కుమార్ అన్ద్కత్, ఎషాన్ మలింగస్ సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, క్రైన్స్ ఫులేట్రా, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్
ఇవి కూడా చదవండి: