Share News

ధోనీ జట్టులో ఉంటే ఆడాల్సిందే.. లేదా రిటైర్ అయిపోవాలి: రవిచంద్రన్ అశ్విన్

ABN , Publish Date - Mar 27 , 2026 | 03:50 PM

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దని సూచించాడు.

ధోనీ జట్టులో ఉంటే ఆడాల్సిందే.. లేదా రిటైర్ అయిపోవాలి: రవిచంద్రన్ అశ్విన్
Ravichandran Ashwin on MS Dhoni

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఎంఎస్ ధోనీపై రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దని సూచించాడు. ‘ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడాన్ని నేను ఒప్పుకోను. అతడు ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉంటే.. కచ్చితంగా ఆడాల్సిందే. ఆడొద్దు అనుకుంటే సీజన్ మొత్తం ఆడొద్దు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విశ్లేషించాడు.


‘మీరు చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టును తయారుచేస్తుంటే.. అందులో ధోనీకి కచ్చితంగా స్థానం కల్పించాలి. ఒకవేళ అతడు ఆడొద్దు అనుకుంటే.. రిటైర్ అయిపోవాలి. అయితే తాను ఆడగలననే నమ్మకం అతడిలో 100శాతం ఉంది. ధోనీ మూడు నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీనిద్వారా తాను ఆడగలననే సందేశాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ అతడు ఆడాలనుకుంటే.. నువ్వు ఆడటం కుదరదు.. అని ధోనీతో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు.


ప్రతిసారీ టాపార్డర్ పరుగులు రాబట్టలేదు. అతడు కాస్త ముందే బ్యాటింగ్‌కు వచ్చి ఉండాల్సింది. అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. వారు టాపార్డర్‌ను పటిష్టం చేసుకున్నారు. ఈ సీజన్‌లోనూ ధోనీ ఒకటి, రెండు మ్యాచుల్లో మాత్రమే కాస్త ముందు బ్యాటింగ్‌కు వస్తాడేమో. దాదాపు అన్ని మ్యాచుల్లోనూ చివర్లోనే బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. కీపింగ్‌పై అతడు ప్రధానంగా దృష్టి సారిస్తాడు. ఫీల్డ్ సెట్టింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు మార్గనిర్దేశం చేస్తాడు. మొత్తానికి ధోనీ సీఎస్కేకి పెద్దన్న పాత్ర పోషిస్తాడు’ అని అశ్విన్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

కెప్టెన్సీ విషయంలో ఎంఐ మరోసారి తప్పు చేయదనుకుంటున్నా: మహ్మద్ కైఫ్

రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న వెస్టిండీస్ స్టార్ ప్లేయర్

Updated Date - Mar 27 , 2026 | 03:51 PM