Share News

రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న వెస్టిండీస్ స్టార్ ప్లేయర్

ABN , Publish Date - Mar 27 , 2026 | 02:08 PM

వెస్టిండీస్ సీనియర్ ప్లేయర్ ఎవిన్ లూయిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026కి ముందు లూయిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని లూయిస్ ఉపసంహరించుకున్నాడు.

రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకున్న వెస్టిండీస్ స్టార్ ప్లేయర్
Evin Lewis

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ సీనియర్ ప్లేయర్ ఎవిన్ లూయిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో వెస్టిండీస్ ప్రకటించిన జట్టులో లూయిస్‌కు చోటు దక్కలేదు. దీంతో అతడు ఉన్నట్టుండి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయాన్ని లూయిస్ ఉపసంహరించుకున్నాడు. తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు.


రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవడంతో మైదానంలోకి దిగేందుకు లూయిస్ సిద్ధమయ్యాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు తరఫున నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నాడు. తన కెరీర్‌లో కేవలం వైట్‌బాల్ క్రికెట్‌కే పరిమితమైన లూయిస్.. తొమ్మిదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్‌లోనూ ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున లూయిస్ 22 మ్యాచుల్లో 1229 పరుగులు సాధించాడు. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన లూయిస్.. 67 వన్డేల్లో 2175 పరుగులు చేశాడు. 65 టీ20 మ్యాచుల్లో 1782 పరుగులు సాధించాడు. ఇందులో వన్డేల్లో 5 సెంచరీలు, టీ20ల్లో రెండు సెంచరీలు ఉన్నాయి.


2016 టీ20 ప్రపంచ కప్ గెలిచిన విండీస్ జట్టులో లూయిస్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేనా.. ఇతడి పేరుపై పలు కీలక రికార్డులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 176 పరుగులు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన క్రికెటర్‌గా లూయిస్ రికార్డులకెక్కాడు. టీ20 ఫార్మాట్లో విండీస్ తరఫున 125* పరుగులతో అత్యధిక స్కోర్ సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్: వైభవ్.. మరో సెన్సేషనల్ సీజన్‌కు సిద్ధమా?

పీఎస్ఎల్‌లో నాసిరకం జెర్సీలు.. అంపైర్‌కు లుబుషేన్ ఫిర్యాదు

Updated Date - Mar 27 , 2026 | 02:08 PM