Share News

పీఎస్ఎల్‌లో నాసిరకం జెర్సీలు.. అంపైర్‌కు లుబుషేన్ ఫిర్యాదు

ABN , Publish Date - Mar 27 , 2026 | 10:38 AM

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తొలి రోజు గడాఫీ స్టేడియం వేదికగా లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్లు తలపడ్డాయి. అయితే ఆట మధ్యలో ఉన్నట్టుండి బంతి రంగులు మారడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.

పీఎస్ఎల్‌లో నాసిరకం జెర్సీలు.. అంపైర్‌కు లుబుషేన్ ఫిర్యాదు
PSL jersey issue

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గురువారం నుంచి ప్రారంభమైన ఈ లీగ్‌లో తొలి రోజు గడాఫీ స్టేడియం వేదికగా లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్లు తలపడ్డాయి. అయితే ఆట మధ్యలో ఉన్నట్టుండి బంతి రంగులు మారడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో బంతి ముందు పింక్, తర్వాత ఎరుపు రంగులోకి మారింది. అయితే హైదరాబాద్ జట్టు ప్లేయర్ల జెర్సీనే దీనికి కారణమని తెలుస్తోంది. సాధారణంగా ప్లేయర్లు బంతికి మెరుపు తెప్పించడం కోసం రుద్దుతారు. ఈ క్రమంలో జెర్సీ రంగు బంతికి అంటి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఆట మధ్యలో బంతి ఇలా రంగు మారడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఆ జెర్సీలు నాసిరకానివి కావడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ కెప్టెన్ మార్నస్ లుబుషేన్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. ‘రెండో ఓవర్ తర్వాత నేను అంపైర్‌తో ఈ విషయంపై మాట్లాడాను. బంతి ఉన్నట్టుండి ఎరుపెక్కింది. అసలు అక్కడ ఏం జరిగిందో నాకర్థం కాలేదు. కచ్చితంగా ఇది జెర్సీల వల్లే జరిగి ఉంటుంది. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చూడలేదు. బ్యాట్ రంగు కాస్త బంతికి అంటుకోవడం, బాల్ ప్యాడ్‌ను తగిలి దానిపై ఉన్న రంగు కొద్దిగా ఊడిపోవడం వంటి సందర్భాలను నేను చూశాను. కానీ దుస్తుల విషయంలో ఇలా జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. రానున్న మ్యాచుల్లో వారు దీన్ని సరిచేస్తారని ఆశిస్తున్నాను’ అని లుబుషేన్ మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరులు సమావేశంలో అన్నాడు.


ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై లాహోర్ జట్టు విజయం సాధించింది. కాగా ఈ విజయంపై హైదరాబాద్ కింగ్స్‌మెన్ జట్టు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ‘తమ తొలి పింక్ బాల్ మ్యాచ్ గెలిచినందుకు ప్రత్యర్థి లాహోర్ జట్టుకు అభినందనలు’ అని పేర్కొంది. మరో వైపు క్రికెట్ అభిమానులు సైతం పీఎస్ఎల్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 10:38 AM