Share News

అలా.. ‘రైజ్‌’ అవుతారా!

ABN , Publish Date - Mar 27 , 2026 | 02:38 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ అంటే కనీసం 250 పరుగులైనా స్కోరుబోర్డు మీద ఉండాల్సిందే.. అనే రీతిలో అభిమానుల అంచనాలు ఉంటాయి. హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌లతో పాటు...

అలా.. ‘రైజ్‌’ అవుతారా!

భారీ హిట్టర్ల అండతో సన్‌రైజర్స్‌ 8 బలహీనంగా బౌలింగ్‌

ఐపీఎల్‌.. రేపటి నుంచే

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ అంటే కనీసం 250 పరుగులైనా స్కోరుబోర్డు మీద ఉండాల్సిందే.. అనే రీతిలో అభిమానుల అంచనాలు ఉంటాయి. హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌లతో పాటు వెటరన్‌ క్లాసెన్‌ల బాదుడుకు ఏ స్టేడియమైనా పరుగుల జడివానలో ముద్దవ్వాల్సిందే. గతేడాది ఏకంగా ఐదుసార్లు 200+ పరుగులతో అదుర్స్‌ అనిపించింది. ఇందులో లీగ్‌ రెండో అత్యధిక స్కోరు 286 కూడా ఉండడం విశేషం. కానీ బౌలింగ్‌ ఆ స్థాయిలో లేకపోవడంతో మొత్తం గా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరో స్థానంలో నిలిచి ప్లేఆ ఫ్స్‌కు దూరంగా ఉండిపోయింది. ఈసారి రెగ్యులర్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ గాయంతో ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో తాత్కాలికంగా ఇషాన్‌కు బాధ్యతలు అప్పగించారు. మినీ వేలంలో లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు తీసుకోగా, ఎక్కువగా యువ ఆటగాళ్లను కొనేందుకే ఫ్రాంచైజీ యాజమాన్యం ఆసక్తి చూపింది. ఈ మాజీ చాంపియన్‌ కేవలం బ్యాటింగ్‌నే నమ్ముకోకుండా అన్ని విభాగాల్లోనూ రాణించి ఈసారైనా టైటిల్‌ను పట్టేయాలనుకుంటోంది.

బలం

నిస్సందేహంగా రైజర్స్‌ బలమంతా బ్యాటింగ్‌లోనే ఉంటుంది. పవర్‌ప్లేలో హెడ్‌, అభిషేక్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో కదం తొక్కుతుంటారు. వీరికి తోడు మిడిలార్డర్‌లో

ఇషాన్‌, క్లాసెన్‌, నితీశ్‌, అనికేత్‌లతో పాటు ఈసారే జట్టులో చేరిన లివింగ్‌స్టోన్‌ల ఫినిషింగ్‌ టచ్‌ ప్రత్యర్థి జట్ల బౌలర్లను వణికించడం ఖాయం. 2025లో క్లాసెన్‌ 487, అభిషేక్‌ 439, హెడ్‌ 374 పరుగులతో కీలకంగా నిలిచారు. భారీ హిట్టింగ్‌ చేయగల రవిచంద్రన్‌స్మరణ్‌ అవకాశం దక్కితే చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. పేసర్‌ ఎషాన్‌ మలింగ కీలకం కానున్నాడు. చివరి సీజన్‌లో అతడు కేవలం 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు.

బలహీనత

సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగం ఈసారికూడా ప్రమాదకరంగా కనిపించడం లేదు. జట్టు భారీ స్కోరు సాధించినప్పటికీ దాన్ని కాపాడుకునేందుకు బౌలర్ల నుంచి సహకారం అవసరం. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో పరుగులను కట్టడి చేయలేక మ్యాచ్‌లను కోల్పోతుంటుంది. పైగా పేసర్‌ కమిన్స్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. గాయంతో చివరి సీజన్‌ ఆడలేపోయిన మరో పేసర్‌ బ్రైడన్‌ కార్స్‌ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. హర్షల్‌ పటేల్‌, జైదేవ్‌ ఉనాద్కట్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. అంతేకాకుండా ఓపెనర్లు విఫలమైతే మిడిలార్డర్‌ కుప్పకూలడం సహజంగా మా రింది. అదేపనిగా బంతిని బాదాలనే కసితో నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించుకుంటున్నారు. అందుకే చక్కటి సమతుల్యం కలిగిన జట్లపై రైజర్స్‌ ఇబ్బంది పడుతుంటుంది.


స్వదేశీ ఆటగాళ్లు: అభిషేక్‌, ఇషాన్‌ కిషన్‌, నితీశ్‌కుమార్‌, అనికేత్‌, జీషన్‌ అన్సారీ, ఉనాద్కట్‌, హర్షల్‌ పటేల్‌, అమిత్‌, హర్ష్‌ దూబే, షకీబ్‌ హుసేన్‌, సలీల్‌ అరోరా, శివమ్‌ మావి, శివాంగ్‌ కుమార్‌, స్మరణ్‌, ఓంకార్‌ తర్మలే, ప్రఫుల్‌ హింజే, క్రెయిన్స్‌ ఫులెట్రా.

విదేశీ ఆటగాళ్లు: ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్‌, క్లాసెన్‌, లివింగ్‌ స్టోన్‌, బ్రైడన్‌ కార్స్‌, ఎషాన్‌ మలింగ, జాక్‌ ఎడ్వర్డ్స్‌, కమిందు మెండిస్‌.

సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌

తేదీ ప్రత్యర్థి వేదిక

మార్చి 28 బెంగళూరు బెంగళూరు

ఏప్రిల్‌ 2 కోల్‌కతా కోల్‌కతా

ఏప్రిల్‌ 5 లఖ్‌నవూ హైదరాబాద్‌

ఏప్రిల్‌ 11 పంజాబ్‌ న్యూచండీగఢ్‌

ఏప్రిల్‌ 13 రాజస్థాన్‌ హైదరాబాద్‌

ఏప్రిల్‌ 18 చెన్నై హైదరాబాద్‌

ఏప్రిల్‌ 21 ఢిల్లీ హైదరాబాద్‌

ఏప్రిల్‌ 25 రాజస్థాన్‌ జైపూర్‌

ఏప్రిల్‌ 29 ముంబై ముంబై

మే 3 కోల్‌కతా హైదరాబాద్‌

మే 6 పంజాబ్‌ హైదరాబాద్‌

మే 12 గుజరాత్‌ అహ్మదాబాద్‌

మే 18 చెన్నై చెన్నై

మే 22 బెంగళూరు హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 02:38 AM