ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
ABN , Publish Date - Mar 26 , 2026 | 07:39 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అనేది 2008 ప్రారంభమైంది. ఇప్పటి వరకు కొన్ని జట్లు అలానే ఉండగా మరికొన్ని జట్ల పేరు మార్పులు, ఇంకొన్ని జట్లు అదనంగా చేరడం జరిగింది. అయితే 2008 నుంచి ఐపీఎల్‌లో భాగంగా ఉన్న అతి కొద్ది జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి.
స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అనేది 2008లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు కొన్ని జట్లు అలానే ఉండగా మరికొన్ని జట్ల పేరు మార్పులు, ఇంకొన్ని జట్లు అదనంగా చేరడం జరిగింది. అయితే 2008 నుంచి ఐపీఎల్‌లో భాగంగా ఉన్న అతి కొద్ది జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఈ జట్టుకు సహ యజమాని ప్రీతి జింటా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దాదాపు పంజాబ్ ఆడే ప్రతి మ్యాచ్‌కు ఈ బ్యూటీ హాజరై.. ప్లేయర్లను ఉత్సాహపరుస్తుంది. ఐపీఎల్ 2025 వేలం సందర్భంగా ప్రీతి జింటా తనకు సారీ చెప్పిందంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్, బ్యాటర్ జితేశ్ శర్మ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
జితేశ్ శర్మ ఐపీఎల్ 2022 నుంచి 2024 వరకు పంజాబ్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రీతి జింటాతో అతడికి మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ 2025 వేలంలో జితేశ్‌ను ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ లో కూడా ఆర్సీబీకే జితేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌లో జితేశ్ శర్మ మాట్లాడుతూ... ప్రీతి జింటాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఆమెను అక్కలా భావిస్తానని వెల్లడించాడు. ఇద్దరిది హిమాచల్ ప్రదేశ్ కావడంతో గంటల తరబడి మాట్లాడుకునే వాళ్లమని అన్నాడు. పంజాబ్ కింగ్స్‌లోకి రావడం తన జీవితాన్ని మలుపు తిప్పిన క్షణమని, తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ప్రీతి జింటా, పంజాబ్ జట్టేనని జితేశ్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2025 వేలంలో కూడా పంజాబ్ జట్టు తనను ఎంచుకునేదని, రూ.7 కోట్లకు 'రైట్-టు-మ్యాచ్' ఆప్షన్‌ను ఉపయోగించారని వెల్లడించాడు. అయితే ఆర్సీబీ దానిని రూ. 11 కోట్లకు పెంచడంతో ఆ జట్టు(పంజాబ్) బడ్జెట్ సరిపోలేకపోయిదని అన్నాడు. వేలం పూర్తైన తర్వాత ప్రీతి జింటా ఫోన్ చేసి, 'నిన్ను తీసుకోలేకపోయినందుకు చాలా క్షమించండి' అని చెప్పారని జితేశ్ చెప్పుకొచ్చాడు. తాను రూ.11 కోట్లకు అమ్ముడుపోయినందుకు ప్రీతి జింటా చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపాడు. ఇటీవలే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆడిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ జితేశ్ శర్మ 37 బంతుల్లో 81 పరుగులు చేయగా, కెప్టెన్ రజత్ పాటిదార్ 25 బంతుల్లో 74 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 12 బంతుల్లో 29 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఇవి కూడా చదవండి:
IPL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..
ఐపీఎల్2026: ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే..!