ఐపీఎల్2026: ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే..!
ABN , Publish Date - Mar 26 , 2026 | 05:47 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 సీజన్‌కు సర్వం సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి.
స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 సీజన్‌కు సర్వం సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రారంభ మ్యాచ్‌కు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఇప్పటి వరకు ముంబై ఐదు సార్లు, కోల్‌కతా మూడు సార్లు ఐపీఎల్ టైటిల్స్‌ను అందుకున్నాయి. ఈ సారి ఐపీఎల్ ట్రోఫీని ఎవరు గెలుస్తారని అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లపై పలువురు వివిధ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.
అలానే భారత మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లపై అంచనా వేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న బెంగళూరు జట్టు ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో ఆర్సీబీ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ సైతం ఈసారి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుందని ముకుంద్ జోస్యం చెప్పాడు.
ఈ రెండు జట్లతో ఐదుసార్లు చాంఫియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక నాలుగవ ప్లే ఆఫ్ జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ముకుంద్ ఎంచుకున్నాడు. ఈ సీఎస్కే గత రెండు సీజన్లలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. గత రెండు సీజన్లలో ఫ్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేక పోయింది. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ 2025 సీజన్లలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.
ఇవి కూడా చదవండి:
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 2026-27 హోం సీజన్ షెడ్యూల్ రిలీజ్
సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్