Share News

సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:59 PM

సౌతాఫ్రికా క్రికెటర్‌ కానర్‌ ఎస్తురూజెన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌గా నిలిచాడు.

సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
Esthuruyzen record

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో 33 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు నిర్ణీత 20 ఓవరల్లో నాలుగు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం 154 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో 3-2 తేడాతో సౌతాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఐదో టీ20 మ్యాచ్‌లో ప్రొటీస్ ప్లేయర్ ఎస్తురూజెన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


నిన్న(బుధవారం) జరిగిన ఐదో టీ20లో ఎస్తురూజెన్‌ 33 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ ఎస్టర్‌హుయిజెన్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌ ఓపెనింగ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. శ్రీలంక దిగ్గజం కుమార్‌ సంగక్కర 2009లో నెలకొల్పిన రికార్డును ఎస్తురూజెన్‌ బ్రేక్ చేశాడు. 2009లో సంగక్కర కివీస్‌పై 69 పరుగులు చేశాడు. తాజాగా ఎస్తురూజెన్ 75 పరుగులు చేశాడు. ఈ ప్రొటీస్ ప్లేయర్ కంటే ముందు ఏ ఆటగాడు కివీస్‌పై 70 పరుగుల మార్కును దాటకపోవడం గమన్హారం.


న్యూజిలాండ్‌పై కాకుండా ఓవరాల్ గా నాలుగో స్థానం లేదా అంతకంటే ముందు స్థానంలో బ్యాటింగ్ చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన వారిలో ఎస్టర్‌హుయిజెన్ రెండవ వ్యక్తి. 2022లో కటక్‌లో భారత్‌పై 81 పరుగుల ఇన్నింగ్స్‌తో సౌతాఫ్రికా ఆటగాడే హెన్రిచ్ క్లాసెన్ టాప్‌లో ఉన్నాడు. ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లింది. ఈ సిరీస్‌లో ఎస్తురూజెన్‌ రెండు అర్ధ శతకాలతో కలిపి మొత్తంగా 200 పరుగులు స్కోరు చేశాడు.


ఇవి కూడా చదవండి:

ముంబైకి సాధ్యమా?

ఆర్సీబీకి అందేనా మళ్లీ!

Updated Date - Mar 26 , 2026 | 03:03 PM