మార్కాపురం బస్సు ప్రమాదం.. పలువురిని కాపాడిన బాలరాజు
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:42 PM
ఇవాళ మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అలాగే ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
ప్రకాశం జిల్లా, మార్చి 26: మార్కాపురం(Markapur bus accident) మండలం రాయవరం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. అలాగే ఈ దుర్ఘటనలో మరో 25 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ బస్సు ప్రమాదంలో పలువురిని బాలరాజు అనే వ్యక్తి రక్షించాడు. బస్సు అద్దాలు పగలగొట్టి పలువురు తోటి ప్రయాణికులను బాలరాజు రక్షించాడు. ఈ క్రమంలో అతడికి కూడా గాయలయ్యాయి. ప్రస్తుతం బాలరాజు మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. బాలరాజు కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతుని పాడు మండలం తక్కెళ్లపాడు గ్రామనికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.
అతడు బస్సు అద్దాలు బ్రేక్ చేయకపోయి ఉంటే మరికొందరు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే వారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాఢ నిద్రలో ఉండగా పెద్ద శబ్దం రావడం, క్షణాల్లో మంటలు(Fire Accident), దట్టమైన పొగ బస్సును చుట్టుముట్టాయని బాధితులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు బస్సు అద్దాలు పగలకొట్టి బయటకు దూకేశారు. అలానే బాలరాజు అనే ప్రయాణికుడు మరోవైపు బస్సు అద్దాలను పగలగొట్టి.. కొందరి ప్రయాణికులను బయటకు పంపాడు. మార్కాపురం బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
ఏపీలో 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లే లక్ష్యం: మంత్రి నాదెండ్ల
మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు పరిహారం