Share News

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు పరిహారం

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:50 PM

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు పరిహారం
Markapuram Bus Accident

అమరావతి, మార్చి 26: ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చించారు. మృతుల కుటుంబాలకు మంత్రివర్గం ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా బస్సు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది సర్కార్. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.


మార్కాపురం మండలం రాయవరం సమీపంలో ఈరోజు(గురువారం) తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. ప్రైవేటు బస్సు, టిప్పర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 13 మంది చనిపోగా.. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

కుప్పంలో మూడో రోజుకు నారా భువనేశ్వరి పర్యటన

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2026 | 03:08 PM