కుప్పంలో మూడో రోజుకు నారా భువనేశ్వరి పర్యటన
ABN , Publish Date - Mar 26 , 2026 | 09:30 AM
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు.
చిత్తూరు, మార్చి 26: కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) ఉదయం ఇంటి వద్ద ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ఆపై శాంతిపురం మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్‌ను భువనేశ్వరి ప్రారంభించనున్నారు. అనంతరం గుండిశెట్టిపల్లిలో ఐటీడీపీ కార్యకర్త రవి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. రామకుప్పం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని భువనేశ్వరి ఆవిష్కరించనున్నారు.
ఆపై రామకుప్పం మండల కేంద్రంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు. బల్ల గ్రామంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఆపై కుప్పం పట్టణంలో టీడీపీ నేత గోపీనాథ్‌కు చెందిన కాంప్లెక్స్‌ను నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
ఘోర ప్రమాదం.. 13 మంది సజీవ దహనం..
మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
Read Latest AP News And Telugu News