ఘోర ప్రమాదం.. 13 మంది సజీవ దహనం..
ABN , Publish Date - Mar 26 , 2026 | 07:11 AM
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లారీ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం.
ప్రకాశం జిల్లా: మార్కాపురం మండలం రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లారీ ఎదురెదురుగా ఢీకొని 13 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయని తెలుస్తోంది. బస్సు, లారీ ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం జరిగింది. రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. బాధితులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ నుంచి ఏపీలోని నెల్లూరుకు బస్సు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
శత్రుదేశాల నౌకల్ని మాత్రమే హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లనివ్వం: ఇరాన్