Share News

నదిలో పడిన బస్సు.. 23 మంది మృతి

ABN , Publish Date - Mar 26 , 2026 | 07:07 AM

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మానదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నదిలో పడిన బస్సు.. 23 మంది మృతి

ఢాకా, మార్చి 26: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ఫెర్రీ ఎక్కే క్రమంలో పద్మానదిలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. రాజ్‌బరి జిల్లాలోని నైరుతి ప్రాంతంలో దౌలత్‌దియా టెర్మినల్ వద్ద బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందగానే.. జిల్లా ఉన్నతాధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో గత అర్ధరాత్రి భారీ క్రేన్ల సాయంతో బస్సును నదిలో నుంచి బయటకు తీశారు. బస్సులోనే 14 మంది ప్రయాణికుల మృతదేహాలు ఉన్నాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.


మరో 11 మంది ప్రయాణికులు నదీలో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి తమ ప్రాణాలను కాపాడుకున్నారని అధికారులు చెప్పారు. మిలిటరీ, పోలీసుల సహాయంతో అగ్నిమాపక, కోస్ట్ గార్డ్ సిబ్బంది.. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారని పేర్కొన్నారు. రంజాన్ పండుగ ముగించుకుని రాజధాని ఢాకా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో చిన్నారులు సహా మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల్లో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వివరాలను బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆయన ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఘోర ప్రమాదం.. 10 మంది సజీవ దహనం..

మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

For More International News And Telugu News

Updated Date - Mar 26 , 2026 | 08:17 AM