మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Mar 26 , 2026 | 06:52 AM
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో లోహాల ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కమోడిటీ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఇటీవల భారీ స్థాయిలో పడిపోయిన పసిడి, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చి 26) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,46,680గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,460గా ఉంది. కిలో వెండి రూ.2,60,100కు పెరిగింది.
నిన్న భారత్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,760ల మేర పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.3,450ల మేర ఎగబాకింది. వెండి ధర ఏకంగా రూ.15 వేల మేర పెరిగింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాముల) స్వచ్ఛమైన పసిడి ధర 4,535 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఔన్స్ వెండి ధర 71 డాలర్లుగా ఉంది.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు:
చెన్నై: ₹1,48,380; ₹1,36,010;
ముంబై: ₹1,46,680; ₹1,34,460;
న్యూఢిల్లీ: ₹1,46,830; ₹1,34,610;
కోల్‌కతా: ₹1,46,680; ₹1,34,460;
బెంగళూరు: ₹1,46,680; ₹1,34,460;
హైదరాబాద్: ₹1,46,680; ₹1,34,460;
విజయవాడ: ₹1,46,680; ₹1,34,460;
కేరళ: ₹1,46,680; ₹1,34,460;
పుణె: ₹1,46,680; ₹1,34,460;
వడోదరా: ₹1,46,730; ₹1,34,510;
అహ్మదాబాద్: ₹1,46,730; ₹1,34,510;
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹2,60,100;
ముంబై: ₹2,50,100;
న్యూఢిల్లీ: ₹2,50,100;
కోల్‌కతా: ₹2,50,100;
బెంగళూరు: ₹2,50,100;
హైదరాబాద్: ₹2,60,100;
విజయవాడ: ₹2,60,100;
కేరళ: ₹2,60,100;
పుణె: ₹2,50,100;
వడోదరా: ₹2,50,100;
అహ్మదాబాద్: ₹2,50,100;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
స్టాక్ మార్కెట్స్.. 2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్ల మేర సంపద వృద్ధి
సెబీ హోల్‌టైమ్ డైరెక్టర్‌గా కేవీ రమణమూర్తి