Share News

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్లు

ABN , Publish Date - Mar 26 , 2026 | 05:33 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ బుధవారం ఒకదశలో...

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్లు

  • భారీగా పెరిగిన మార్కెట్‌ సంపద

  • సెన్సెక్స్‌ మరో 1,205 పాయింట్ల వృద్ధి

ముంబై: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ బుధవారం ఒకదశలో 1,781.31 పాయింట్లు ఎగబాకి 75,849.76 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసిం ది. చివరికి 1,205 పాయింట్ల లాభంతో 75,273.45 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 394.05 పాయింట్ల వృద్ధితో 23,306.45 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఒక్కరోజే రూ.8.23 లక్షల కోట్లు పెరిగి రూ.431.01 లక్షల కోట్లకు (4.59 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. రెండు రోజుల మార్కెట్‌ ర్యాలీలో సెన్సెక్స్‌ 2,577.06 పాయింట్లు, నిఫ్టీ 793.8 పాయింట్లు ఎగబాకాయి. మార్కెట్‌ సంపద రూ.15.80 లక్షల కోట్లు పెరిగింది.

  • సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 26 రాణించాయి. అలా్ట్రటెక్‌ సిమెంట్‌ షేరు 4.12 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

  • బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీ 3.05ు, మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ ఇండెక్స్‌ 2.50ు లాభపడ్డాయి. రంగాలవారీ సూచీలన్నీ లాభపడ్డాయి.

  • బుల్‌ ర్యాలీలోనూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) అమ్మకాలకే మొగ్గుచూపారు. మరో రూ.1,805.37 కోట్ల నికర విక్రయాలు జరిపారు. కాగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐ) నికరంగా రూ.5,429.78 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

గోల్డ్‌, సిల్వర్‌ హైజంప్‌: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన విలువైన లోహాల ధరలు మళ్లీ భారీగా ఎగబాకాయి. పసిడి రూ.1.50 లక్షలకు చేరువ కాగా.. వెండి రూ.2.40 లక్షలు దాటింది. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం రేటు 10 గ్రాములపై రూ.4,900 (3.38%) పెరిగి రూ.1,49,700కు చేరింది. కిలో వెండి ఏకంగా రూ.11,250 పెరుగుదలతో రూ.2,41,250 ధర పలికింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒకదశలో దాదాపు 2% పెరిగి 4,556 డాలర్లకు చేరుకోగా.. సిల్వర్‌ 73 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.

కరెన్సీ కొత్త ఆల్‌టైం కనిష్ఠం

భారత కరెన్సీ సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి జారుకుంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 20 పైసలు క్షీణించి రూ.93.96 వద్దకు చేరింది. డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు ఇంట్రాడేలో రూ.93.86- 94.13 శ్రేణిలో కదలాడింది. ముడిచమురు ధరలు 100 డాలర్ల దిగువకు జారుకోవడం, డాలర్‌ కాస్త బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్లో భారీ లాభాలు వంటి సానుకూల అంశాలు సైతం మన కరెన్సీని ఆదుకోలేకపోయాయని వారన్నారు. అంతర్జాతీ య మార్కెట్లో బ్రెంట్‌ ముడిచమురు బ్యారెల్‌ ధర ఒకదశలో 97.15 డాలర్లకు తగ్గింది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 05:33 AM