బ్యాడ్మింటన్‌కు మారిన్ వీడ్కోలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:30 AM
మూడుసార్లు వరల్డ్ చాంపియన్, స్పానిష్ బ్యాడ్మింటన్ గ్రేట్ కరోలినా మారిన్(32) కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. మోకాలి గాయం తిరగబెడుతుండడంతో...
న్యూఢిల్లీ: మూడుసార్లు వరల్డ్ చాంపియన్, స్పానిష్ బ్యాడ్మింటన్ గ్రేట్ కరోలినా మారిన్(32) కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. మోకాలి గాయం తిరగబెడుతుండడంతో ఇక ఆటకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకొన్నట్టు మాజీ వరల్డ్ నెం:1 మారిన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో తెలిపింది. 2016 రియో ఒలింపిక్స్, 2018 వరల్డ్ చాంపియన్‌షి్‌ప ఫైనల్లో భారత షట్లర్ పీవీ సింధును మారిన్ ఓడించింది. ‘ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నా ప్రయాణం ముగిసింది. సొంతగడ్డపై ఆటకు వీడ్కోలు పలకాలనుకొన్నా..కానీ శరీరం సహకరించడం లేదు. అందుకే కఠిన నిర్ణయం తీసుకొన్నాన’ని మారిన్ చెప్పింది. 2015, 2024లో రెండుసార్లు ఆల్ ఇంగ్లండ్ టైటిల్‌ను మారిన్ దక్కించుకొంది. చివరిసారి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది.

ఎక్కువగా ద్వేషించేది నిన్నే: సింధు
ఈ సందర్భంగా చిరకాల ప్రత్యర్థి, స్నేహితురాలు మారిన్‌కు సింధు హృదయానికి హత్తుకొనే సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భవిష్యత్‌లో ఆమెకు అంతా మంచే జరగాలని కోరింది. ‘నా అంతరాత్మలో, టూర్‌లో నీకంటే ఎక్కువగా ద్వేషించే ప్లేయర్ మరొకరు లేరని నమ్ముతున్నా. నీ సంకల్ప బలం, పట్టుదల, వ్యూహచతురతకు సాటిలేదు. నీ గురించి, నీ మనోబలం గురించి నాకు తెలుసు. ఎప్పటికీ నీకు మద్దతుదారుగా ఉంటాన’ని సింధు రాసింది.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..