Share News

హైదరాబాద్‌లో టీ20, వన్డే

ABN , Publish Date - Mar 27 , 2026 | 02:33 AM

టీమిండియా హోం క్యాలెండర్‌లో హైదరాబాద్‌ రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకొంది. వెస్టిండీ్‌సతో టీ20, జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌ ఇక్కడ జరగనున్నాయి...

హైదరాబాద్‌లో టీ20, వన్డే

  • టీమిండియా హోం షెడ్యూల్‌ విడుదల

  • వచ్చే ఏడాది ఆసీ్‌సతో 5 టెస్ట్‌ల సిరీస్‌

  • 25 ఏళ్ల తర్వాత భారత్‌లో జింబాబ్వే పర్యటన

  • రో-కో 9 వన్డేలు ఆడే అవకాశం

న్యూఢిల్లీ: టీమిండియా హోం క్యాలెండర్‌లో హైదరాబాద్‌ రెండు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కించుకొంది. వెస్టిండీ్‌సతో టీ20, జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌ ఇక్కడ జరగనున్నాయి. 2026-27లో స్వదేశంలో జరిగే సిరీ్‌సల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. వెస్టిండీస్‌, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత పర్యటనకు రానున్నాయి. ఈ క్యాలెండర్‌లో సొంతగడ్డపై భారత్‌ 5 టెస్ట్‌లు, 9 వన్డేలు, 8 టీ20లు ఆడనుంది. మొత్తం 22 మ్యాచ్‌లకు 17 నగరాలను ఖరారు చేశా రు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ 9 వన్డేల్లో ఆడే అవకాశం ఉంది. 2026 సెప్టెంబరు 27న వెస్టిండీ్‌సతో ఆరంభం కాను న్న హోం సిరీ్‌స.. 2027 మార్చి 3తో ముగుస్తుంది.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా వచ్చే జనవరి 21 నుంచి జరిగే టూర్‌లో భారత్‌తో ఆస్త్రేలియా ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనుంది. గత నవంబరులో సౌతాఫ్రికాతో టెస్ట్‌కు ఆతిథ్యం ఇచ్చిన గువాహటికి ఆసీ్‌సతో టెస్ట్‌ను కేటాయించగా.. ముంబై, కోల్‌కతాలకు టెస్ట్‌లను షెడ్యూల్‌ చేయలేదు. కాగా, 2002 తర్వాత జింబాబ్వే జట్టు తొలిసారి భారత్‌లో పర్యటించనుంది.

భారత జట్టు 2026-27

హోం సీజన్‌ క్యాలెండర్‌

వెస్టిండీ్‌సతో..

తొలి వన్డే సెప్టెంబరు 27 తిరువనంతపురం

రెండో వన్డే సెప్టెంబరు 30 గువాహటి

మూడో వన్డే అక్టోబరు 3 న్యూచంఢీగడ్‌

తొలి టీ20 అక్టోబరు 6 లఖ్‌నవూ

రెండో టీ20 అక్టోబరు 9 రాంచీ

మూడో టీ20 అక్టోబరు 11 ఇండోర్‌

నాలుగో టీ20 అక్టోబరు 14 హైదరాబాద్‌

ఐదో టీ20 అక్టోబరు 17 బెంగళూరు

శ్రీలంకతో..

తొలి వన్డే డిసెంబరు 13 ఢిల్లీ

రెండో వన్డే డిసెంబరు 16 బెంగళూరు

మూడో వన్డే డిసెంబరు 19 అహ్మదాబాద్‌

తొలి టీ20 డిసెంబరు 22 రాజ్‌కోట్‌

రెండో టీ20 డిసెంబరు 24 కటక్‌

మూడో టీ20 డిసెంబరు 27 పుణె

జింబాబ్వేతో (2027లో)

తొలి వన్డే జనవరి 3 కోల్‌కతా

రెండో వన్డే జనవరి 6 హైదరాబాద్‌

మూడో వన్డే జనవరి 9 ముంబై

ఆస్ట్రేలియాతో..

తొలి టెస్ట్‌ జనవరి 21 నుంచి నాగ్‌పూర్‌

రెండో టెస్ట్‌ జనవరి 29 నుంచి చెన్నై

మూడో టెస్ట్‌ ఫిబ్రవరి 11 నుంచి గువాహటి

నాలుగో టెస్ట్‌ ఫిబ్రవరి 19నుంచి రాంచీ

ఐదో టెస్ట్‌ ఫిబ్రవరి 27 నుంచి అహ్మదాబాద్‌

ఇవి కూడా చదవండి:

ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్

PL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 02:33 AM