కెప్టెన్సీ విషయంలో ఎంఐ మరోసారి తప్పు చేయదనుకుంటున్నా: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:57 PM
ఐపీఎల్ 2026 సందడికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడికి మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. శనివారం నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక సూచనలు చేశాడు. ముంబై ఇండియన్స్‌కు ప్రస్తుతం హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని భారత జట్టు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై మహ్మద్ కైఫ్ తనదైన శైలితో స్పందించాడు.
‘కెప్టెన్సీ మార్పు విషయంలో ముంబై ఇండియన్స్ మరోసారి తప్పు చేయదని అనుకుంటున్నా. వారు రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని హార్దిక్ పాండ్యకు అప్పగించిన తర్వాత జట్టు ప్రదర్శన దారుణంగా పడిపోయింది. హార్దిక్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్సీ ఆప్షన్. కానీ రోహిత్ శర్మ విషయంలో జరిగినట్లుగా మళ్లీ హార్దిక్ పాండ్యకు జరగొద్దు’ అని మహ్మద్ కైఫ్ అన్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్: వైభవ్.. మరో సెన్సేషనల్ సీజన్‌కు సిద్ధమా?
పీఎస్ఎల్‌లో నాసిరకం జెర్సీలు.. అంపైర్‌కు లుబుషేన్ ఫిర్యాదు