మన చికిత బంగారం
ABN , Publish Date - Mar 28 , 2026 | 04:11 AM
తెలుగమ్మాయి తానిపర్తి చికిత ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్-1 ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో కరీంనగర్‌కు చెందిన చికిత స్వర్ణ....
స్వర్ణంతో మెరిసిన తెలుగమ్మాయి
మరో రజతం సొంతంఆసియా కప్ ఆర్చరీలో భారత్‌కు 10 పతకాలు
బ్యాంకాక్: తెలుగమ్మాయి తానిపర్తి చికిత ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్-1 ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో కరీంనగర్‌కు చెందిన చికిత స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. కాంపౌండ్ మిక్స్‌డ్ కేటగిరీలో టైటిల్ దక్కించుకున్న చికిత, ఇదే విభాగం మహిళల టీమ్ ఈవెంట్‌లో రన్నర్‌పగా నిలిచింది. కాంపౌండ్ వ్యక్తిగత కేటగిరీలో మూడు పతకాలనూ మన ఆర్చర్లు స్వీప్ చేశారు. ఇక..మొత్తం 10 పతకాలతో టోర్నీని భారత్ ఘనంగా ముగించింది. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలున్నాయి. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగం తుది పోరులో చికిత/రజత్ చౌహాన్ ద్వయం 158-156తో మలేసియా జోడీ ఫతిన్/సలేహ్‌ని ఓడించి స్వర్ణం చేజిక్కించుకుంది. అనంతరం చికిత, రాజ్‌కౌర్, తేజల్ త్రయం కాంపౌండ్ టీమ్ ఫైనల్లో 227-229తో కజకిస్థాన్‌కు చెందిన విక్టోరియా, డాయానా, రొక్సానా బృందం చేతిలో ఓటమిపాలై రజతం అందుకుంది. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఉదయ్ కాంబోజ్ 145-144తో సహచరుడు ప్రథమేష్‌పై గెలిచి పసిడి సొంతం చేసుకున్నాడు. కాంస్య పతక ప్లేఆఫ్‌లో రజత్ చౌహాన్ 145-144తో పీరావత్ (థాయ్‌లాండ్)కు షాకిచ్చాడు. దాంతో ఈ విభాగంలో మూడు పతకాలూ భారత్ ఖాతాలో చేరాయి. రికర్వ్ విభాగంలో మన ఆర్చర్లు రెండు రజతాలు నెగ్గారు. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో రిధి పోర్ 2-6తో ఎర్డెనె (మంగోలియా) చేతిలో, పురుషుల రికర్వ్ టీమ్ ఫైనల్ షూటా్‌ఫలో దేవాంగ్ గుప్తా, సుఖ్‌చైన్ సింగ్, జూయెల్ త్రయం 27-30తో కజకిస్థాన్ బృందం చేతిలో ఓటమితో రజత పతకాలతో సరిపెట్టుకున్నారు.