Share News

ఐపీఎల్ 2026: ఆ బ్యాటర్లకు ఇది మర్చిపోలేని రోజు అవుతుంది: రవిచంద్రన్ అశ్విన్

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:54 PM

ఐపీఎల్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: ఆ బ్యాటర్లకు ఇది మర్చిపోలేని రోజు అవుతుంది: రవిచంద్రన్ అశ్విన్
Ravi Ashwin

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆర్సీబీపై చెలరేగుతాడని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వెల్లడించాడు.


‘గతేడాది కాలంగా టీ20ల్లో పెద్దగా రాణించకపోలేకపోతున్నాడు. కానీ క్లాసెన్ ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చాడంటే అతడిని ఆపడం చాలా కష్టం. ఫామ్ అందుకున్నాడంటే ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడే అవకాశం ఉంది. క్లాసెన్‌కు నేటి మ్యాచ్ గుర్తుండిపోతుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్‌ వంటి ప్లేయర్లతో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. అన్నీ కలిసొస్తే 300 పరుగుల స్కోర్ కూడా అసాధ్యం కాదు’ అని అశ్విన్ విశ్లేషించాడు.


బెథెల్ రాణిస్తాడు..

ఆర్సీబీ తరఫున యువ ప్లేయర్ జాకబ్ బెథెల్ అద్భుతంగా రాణించే అవకాశం ఉందని అశ్విన్ అన్నాడు. ‘టీ20 ప్రపంచ కప్ 2026లో ఇంగ్లండ్ యువ ప్లేయర్ జాకబ్ బెథెల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అదే దూకుడుతో ఇప్పుడు ఆర్సీబీ తరఫున బరిలోకి దిగుతున్నాడు. గతంలో రెండుసార్లు ఎస్ఆర్‌హెచ్-ఆర్సీబీ మధ్య భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుంది. అయితే హేజిల్‌వుడ్ లేని లోటు ఆర్సీబీకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఒత్తిడి అంతా భువనేశ్వర్ కుమార్‌పైనే ఉంది. అయితే చివరి ఓవర్లలో వికెట్లు చేతిలో ఉంటే ఆర్సీబీ పరుగులు ఆపడం దాదాపు అసాధ్యం’ అని అశ్విన్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

Updated Date - Mar 28 , 2026 | 05:19 PM