Share News

రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు..

ABN , Publish Date - Mar 28 , 2026 | 03:42 PM

పశ్చిమాసియాలో ఉద్రిక‌త్త‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు అమెరికా శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుండగా.. మ‌రోవైపు ఇరాన్, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య దాడులు, ప్ర‌తి దాడులు కొన‌సాగుతున్నాయి. తాజాగా ఈ యుద్ధంలోకి మ‌రో దేశం కూడా చేరిన‌ట్లు క‌నిపిస్తోంది.

రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు..
Houthis Israel attack

పశ్చిమాసియాలో ఉద్రిక‌త్త‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు అమెరికా శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తుండగా.. మ‌రోవైపు ఇరాన్, ఇజ్రాయెల్‌ల మ‌ధ్య దాడులు, ప్ర‌తి దాడులు కొన‌సాగుతున్నాయి. తాజాగా ఈ యుద్ధంలోకి మ‌రో దేశం కూడా చేరిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా యెమెన్ నుంచి ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి జరిగింది. యెమెన్ నుంచి ప్రయోగించిన మిసైల్‌ను ఇజ్రాయెల్ గగనతలంలోనే అడ్డుకుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత యెమెన్ నుంచి జరిగిన తొలి దాడి ఇదే (Houthis Israel attack).


ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటు గ్రూప్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడికి పాల్పడింది. 2014 నుంచి యెమెన్ రాజధాని సనా నగరాన్ని హౌతీలు తమ నియంత్రణలో ఉంచుకున్నారు. అక్కడి నుంచే తాజాగా ఇజ్రాయెల్‌పై దాడి చేసినట్టు సమాచారం. ఇజ్రాయెల్‌లోని బీర్ షెబాతో సహా మరికొన్ని ప్రాంతాల్లో సైరన్లు మోగించడంతో ప్రజలు ఆశ్రయ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చింది. హౌతీలు పూర్తిగా యుద్ధంలోకి ప్రవేశిస్తే ఎర్ర సముద్రం మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు ప్రమాదం తప్పదు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ సమయంలో ఈ మార్గంలో వెళ్లే వాణిజ్య నౌకలపై హౌతీలు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు (Yemen missile strike Israel).


ఎర్ర సముద్రం మీదుగా ప్రతీ సంవత్సరం సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకులు రవాణా అవుతాయి. ఎర్ర సముద్రం ద్వారా రవాణాను హౌతీలు ఆపేస్తే ఇజ్రాయెల్‌కు తీవ్ర నష్టం తప్పదు (Iran war escalation). ఎందుకంటే ఇజ్రాయెల్ దిగుమతులలో సుమారు 30 శాతం ఈ జలమార్గం గుండానే జరుగుతాయి. హౌతీ తిరుగుబాటుదారులు నవంబర్ 2023 నుంచి జనవరి 2025 వరకు క్షిపణులు, డ్రోన్‌లతో 100కు పైగా వాణిజ్య నౌకలపై దాడి చేశారు. రెండు నౌకలను ముంచేసి, నలుగురు నావికులను హతమార్చారు.


ఈ వార్తలూ చదవండి:

వామ్మో.. పానీ పూరీ వాలా! ఇతడి ముందు టెకీలు కూడా దిగదుడుపే

విద్యార్థిని చితకబాదిన టీచర్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Updated Date - Mar 28 , 2026 | 03:51 PM