Share News

భారత్‌లో మెడిసిన్స్ ధర ఇంత తక్కువా! ఫారిన్ మహిళ వీడియో వైరల్

ABN , Publish Date - Mar 28 , 2026 | 02:20 PM

భారత్‌లో ఔషధాలు ఎంత తక్కువకు లభిస్తాయో తెలుసుకుని ఓ ఫారినర్ ఆశ్చర్యపోయారు. ఆమె నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

భారత్‌లో మెడిసిన్స్ ధర ఇంత తక్కువా! ఫారిన్ మహిళ వీడియో వైరల్
Foreigner Surprised Over Medicine Rates in India

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఔషధాలు ఎంత తక్కువ ధరకు లభిస్తాయో తెలుసుకున్న ఒక విదేశీ మహిళ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పంచుకున్నారు. ఈ అనుభవం తనను నిజంగానే ఆశ్చర్యానికి గురి చేసిందని మహిళ వీడియోలో కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఐనెస్ ఫారియా అనే ఫారినర్ ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు. తనకు దగ్గు ఎక్కువ కావడంతో సమీపంలోని మెడికల్ షాపులో మందులు కొనుక్కున్నట్టు చెప్పారు. కాఫ్ సిరప్, గొంతు గరగరను తగ్గించే టాబ్లెట్స్‌ను కొనుగోలు చేశానని చెప్పారు. అన్నింటికి కలిపి కేవలం రూ.252 మాత్రమే చెల్లించానని అన్నారు. ఇది దాదాపు రెండు యూరోలకు సమానం అని, భారత్‌లో ఔషధాలు ఇంత తక్కువ ధరకు లభిస్తున్నాయో తెలిసి ఆశ్చర్యం వేసిందని చెప్పారు. ఇంత తక్కువ ధరలు చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తోందని కూడా కామెంట్ చేశారు.


ఇక ఈ వీడియోపై సహజంగానే జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో సాధారణ ఔషధాలు చాలా తక్కువ ధరకు లభిస్తాయని అనేక మంది అభిప్రాయపడ్డారు. వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండేలా భారత్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భారత్‌లో చాలా మంది మందులను బల్క్‌లో ఎందుకు కొనుగోలు చేస్తారో అర్థమైందని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు. భారత్‌ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాల్లో ఇదీ ఒకటని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


ఈ వార్తలూ చదవండి:

వామ్మో.. పానీ పూరీ వాలా! ఇతడి ముందు టెకీలు కూడా దిగదుడుపే

విద్యార్థిని చితకబాదిన టీచర్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Updated Date - Mar 28 , 2026 | 02:30 PM