విద్యార్థిని చితకబాదిన టీచర్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:32 AM
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని సందీపని గురుకులంలో విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. మార్చి 14వ తేదీన హాస్టల్‌లో ఓ విద్యార్థి మంచంపై మరో స్టూడెంట్ నిద్రించాడు. ఈ విషయం ఉపాధ్యాయుడు, అదే హాస్టల్‌కి వార్డెన్‌గా పని చేస్తున్న దత్తాదాస్ షెవ్డేకి తెలిసింది.
మధ్యప్రదేశ్: ఉజ్జయినిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టిన (Student Beaten By Teacher) వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు (Netizens) టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న తప్పుకు అంత పెద్ద శిక్షా అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటన మహర్షి సందీపని రాష్ట్రీయ వేదవిద్యా ప్రతిష్ఠాన్ (Maharshi Sandipani Rashtriya Vedavidya Pratishthan) దృష్టికి సైతం వెళ్లింది.
అసలేం జరిగిందంటే..
ఉజ్జయినిలోని సందీపని గురుకులంలో విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. మార్చి 14వ తేదీన హాస్టల్‌లో ఓ విద్యార్థి మంచంపై మరో స్టూడెంట్ నిద్రించాడు. ఈ విషయం ఉపాధ్యాయుడు, అదే హాస్టల్‌కి వార్డెన్‌గా పని చేస్తున్న దత్తాదాస్ షెవ్డేకి తెలిసింది. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. మార్చి 15న తరగతి గదిలో తోటి విద్యార్థుల ముందే బాలుడిని చితకబాదాడు. విద్యార్థి భయంతో వణికిపోతున్నా వదిలిపెట్టలేదు. పెద్ద కర్ర తీసుకుని కాళ్లు, చేతులు, భుజాలు సహా ఒళ్లంతా వాతలు తేలేలా కొట్టాడు. తనను కొట్టవద్దని ఎంత బతిమిలాడినా టీచర్ మాత్రం కనికరం చూపలేదు. అతని బాధను చూడలేని ఓ విద్యార్థి ఈ తతంగం మెుత్తం వీడియో తీశాడు.
ఇటీవల ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా గంటల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఉపాధ్యాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నతప్పుకు అంత పెద్ద శిక్ష వేయడం ఏంటని మండిపడుతున్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గురుకుల పాఠశాల, విద్యార్థుల భద్రత, కఠినమైన క్రమశిక్షణా పద్ధతులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
ఈ వార్తలు కూడా చదవండి
మీ కళ్లను పరీక్షించుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 19 సెకెన్లలో కనిపెట్టండి
మీ కళ్లు చురుకైనవి అయితే.. తప్పు స్పెల్లింగ్‌తో ఉన్న పదాన్ని 15 సెకెన్లలో కనిపెట్టండి..