Share News

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Mar 30 , 2026 | 06:19 AM

అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (మార్చి 30న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

స్థిరంగా వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా బంగారం, వెండి ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి (Gold prices).


ఈ రోజు (మార్చి 30న) ఉదయం 6:00 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,48,080 దగ్గర ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,740 దగ్గర ఉంది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,48,210కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,35,890కి చేరుకుంది.


మరోవైపు వెండి ధర కూడా క్రమంగా కిందకు దిగి వస్తోంది. 2.5 లక్షల రూపాయల మార్క్‌ దిగువకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ.1,48,080, రూ.1,35,740

  • విజయవాడలో రూ.1,48,080, రూ.1,35,740

  • ఢిల్లీలో రూ.1,48,210, రూ.1,35,890

  • ముంబైలో రూ.1,48,080, రూ.1,35,740

  • వడోదరలో రూ.1,48,110, రూ.1,35,790

  • కోల్‌కతాలో రూ.1,48,080, రూ.1,35,740

  • చెన్నైలో రూ.1,49,010, రూ.1,36,590

  • బెంగళూరులో రూ.1,48,080, రూ.1,35,740

  • కేరళలో రూ.1,48,080, రూ.1,35,740

  • పుణెలో రూ.1,48,080, రూ.1,35,740


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ.2,49,900

  • విజయవాడలో రూ.2,49,900

  • ఢిల్లీలో రూ.2,44,900

  • చెన్నైలో రూ.2,49,900

  • కోల్‌కతాలో రూ.2,44,900

  • కేరళలో రూ.2,49,900

  • ముంబైలో రూ.2,44,900

  • బెంగళూరులో రూ.2,44,900

  • వడోదరలో రూ.2,44,900

  • అహ్మదాబాద్‌లో రూ.2,44,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఈ వార్తలూ చదవండి:

గర్భధారణపై మైక్రోగ్రావిటీ ప్రభావం.. శాస్త్రవేత్తలు ఏం తేల్చారంటే..

జుట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు.. వీడియో వైరల్

Updated Date - Mar 30 , 2026 | 06:29 AM