ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం: బుర్జ్ ఖలీఫాకు ఇన్సురెన్స్ ఉందా? వివరాలు ఇవే...
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:39 PM
దుబాయ్‌లోని అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్కడి ప్రముఖ బుర్జ్ ఖలీఫాపై కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగం జరిగింది. అయితే ఆ భవనంకి ఎలాంటి ముప్పు వాటిల్ల లేదు. ఒకవేళ...
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యలకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికాకు చెందిన సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్‌పై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల కారణంగా బుర్జ్ ఖలీఫాతో సహా కీలకమైన ప్రదేశాలను అధికారులు ఖాళీ చేయించారు. నగరంలో పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు. ఇదే బుర్జ్ ఖలీఫాపై కూడా ఇరాన్ క్షిపణుల ప్రయోగం జరగ్గా విఫలమైంది. ఒకవేళ నిజంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా(Burj Khalifa)పై దాడి జరిగితే పరిస్థితి ఏంటి..? ఆ భవనంకు బీమా ఉందా..? ఈ అంశంపై ఇప్పుడో ఆసక్తికర చర్చ జరుగుతోంది. స్థానిక మీడియా సమాచారం ప్రకారం బుర్జ్ ఖలీఫాకు ఇన్సూరెన్స్ ఉంది.
బుర్జ్ ఖలీఫాన 'ఎమ్మార్ ప్రాపర్టీస్'(Emaar Properties) అనే కంపెనీ నిర్మించింది. దీని నిర్మాణ ఖర్చు సుమారు 1.5 బిలియన్ డాలర్లు , మన కరెన్సీలో దాదాపు రూ.12,000 కోట్లు పైగా ఉంది. ప్రస్తుతం దీని పునర్నిర్మాణ విలువ 2.8 నుంచి 3.5 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుర్జ్ ఖలీఫా బీమా విధానం బహుళ స్థాయి వ్యవస్థలో ఉంటుంది. నిర్మాణ సమయంలో బీమా, నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఒమన్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రధాన బీమా పాలసీని అందించింది. ఇది దుబాయ్ ఆధారిత ఇన్సూరెన్స్ కంపెనీ. నిర్మాణంలో ఏదైనా ప్రమాదం, ప్రమాదాలు, అగ్నిప్రమాదం, ప్రకృతి విపత్తులు మొదలైన వాటికి కవరేజ్ అందేలా ఇన్సూరెన్స్ పాలసీని రూపొందింది.
మొత్తం ఎక్స్‌పోజర్ సుమారు 1.5 బిలియన్ డాలర్ల ఉందని సమాచారం. దీనిలో ఒమన్ ఇన్సూరెన్స్ కేవలం 15 శాతం మాత్రమే రిటైన్ చేసుకుంది. మిగిలినది అంతర్జాతీయ రీ ఇన్సూరెన్స్ మార్కెట్‌కు వెళ్లింది. అయితే యుద్ధ పరిస్థితుల్లో ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తిస్తుందనేదే సమస్య. దీనికి ఉన్న పరిమితులు, నిబంధనల్ని అనుసరించి మాత్రమే కవరేజ్ లభిస్తుందని సమాచారం. అది కూడా పాక్షికంగానా లేదా పూర్తిగానే అనేది కూడా తెలియదు. ఇక ప్రస్తుతం దుబాయ్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ కూడా మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల్లో బుర్జ్ ఖలీఫా రక్షణపై ఆందోళన కలుగుతోంది.
ఇవి కూడా చదవండి:
మైనింగ్ ఈ-వేలంలో భారీగా అక్రమాలు: కేటీఆర్
చోటి హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?