మైనింగ్ ఈ-వేలంలో భారీగా అక్రమాలు: కేటీఆర్
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:15 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. స్వతంత్ర విచారణ చేసి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు1,100 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్‌పై స్పష్టత లేకుండానే వేలం నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఆ కంపెనీల ఎంపికపై అనుమానాలు..
ఇందులో ప్రధాన సాంకేతిక వివరాల లోపం - Latitude–Longitude, DGPS సర్వే వివరాలు ఎందుకు వెల్లడించలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. జియోలాజికల్ నివేదికలు ఎందుకు లేవని నిలదీశారు. మినరల్ యాక్షన్ రూల్స్–2015 ఉల్లంఘన జరిగిందన్నారు. తెలంగాణ హైకోర్టు సూచనలని కాంగ్రెస్ సర్కార్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్ల ప్రకటనపై, ఆ కంపెనీల ఎంపికపై అనుమానాలున్నాయని అన్నారు.
మైనింగ్ అక్రమాలు, కేసులు ఎదుర్కొంటున్న డెక్కన్ సిమెంట్స్, NCL ఇండస్ట్రీస్‌కు బ్లాక్‌ల కేటాయింపుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆ టెండర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని అనుమతుల తర్వాతే పారదర్శకంగా కొత్త వేలం నిర్వహించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బహ్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా
హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And Telugu News