Share News

హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ.. ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 01 , 2026 | 09:50 AM

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌‌కి ఏపీ సీఎం చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవలో మరింత కాలం ఆరోగ్యంగా, ఆనందంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

 హ్యాపీ బర్త్ డే నితీశ్ జీ..  ప్రజాసేవలో మరింత ముందుకెళ్లాలి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు, కేంద్ర మంత్రులు,ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించిన చంద్రబాబు, నితీష్ కుమార్‌కి తన సందేశాన్ని పంపారు.


నితీశ్ కుమార్ ప్రజాసేవలో మరింత కాలం ఆరోగ్యంగా, ఆనందంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బీహార్ అభివృద్ధిలో నితీశ్ కుమార్ పాత్రను, ఆయన చేస్తున్న విశేష కృషిని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. నితీశ్ కుమార్ భారత రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నేతలలో ఒకరని ప్రశంసించారు. బీహార్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన.. భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 01 , 2026 | 10:04 AM