ఇరాక్‌లో ఇజ్రాయెల్ రహస్య స్థావరం.. గొర్రెల కాపరి ఎలా గుర్తించాడంటే..
ABN , Publish Date - May 10 , 2026 | 07:30 PM
ఇరాక్‌లోని పశ్చిమ ఎడారి ప్రాంతంలో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి చోట స్థానిక గొర్రెల కాపరి ఏదో అసాధారణమైనదాన్ని గమనించాడు. హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయి. మారుమూల ప్రాంతంలో వింత కార్యకలాపాలు జరుగుతున్నాయి.
ఇరాక్‌లోని పశ్చిమ ఎడారి ప్రాంతంలో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి చోట స్థానిక గొర్రెల కాపరి ఏదో అసాధారణమైనదాన్ని గమనించాడు. హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఎగురుతున్నాయి. మారుమూల ప్రాంతంలో వింత కార్యకలాపాలు జరుగుతున్నాయి. తన దేశంలో ఇజ్రాయెల్ నిర్మించిన ఒక రహస్య స్థావరాన్ని తాను అనుకోకుండా కనుగొన్నానని అతడికి అప్పటికి తెలియదు. ఆ ప్రాంతం గురించి ఇరాక్ దళాలకు అతడు సమాచారం ఇవ్వడంతో అసలు కథ బయటపడింది (Israel Iraq secret base).
ఇరాన్‌పై వైమానిక దాడుల కోసం ఇరాక్‌లో ఇజ్రాయెల్ ఓ రహస్య సైనిక స్థావరం ఏర్పాటు చేసినట్లు 'వాల్‌స్ట్రీట్ జర్నల్' తాజాగా ఓ కథనం వెలువరించింది. ఆ విషయం ఇరాక్ ప్రభుత్వానికి తెలియదట. అయితే అమెరికాకు మాత్రం తెలుసట. ఇరాన్‌పై దాడులు చేసేందుకు వీలుగా ఫిబ్రవరి నెలలోనే ఈ తాత్కాలిక స్థావరాన్ని ఇరాక్‌లో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిందట.
ఈ స్థావరం ఇజ్రాయెల్ వైమానిక దళాలకు లాజిస్టిక్ హబ్‌గా పనిచేసింది. అక్కడ ప్రత్యేక కమాండో బలగాలు, రెస్క్యూ టీమ్‌లు కూడా ఉన్నాయని సమాచారం. శత్రు భూభాగంలో విమానాలు కూలిన సందర్భాల్లో పైలట్లను రక్షించేందుకు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది (Iraq desert military base).
ఆ స్థావరాన్ని గొర్రెల కాపరి గుర్తించి సమాచారం అందించిన తర్వాత ఇరాకీ దళాలు అక్కడకు చేరుకున్నాయట (Israeli covert operation). ఆ దళాలపై ఇజ్రాయెల్ కాల్పులు జరిపిందట. ఆ కాల్పుల్లో ఒక ఇరాకీ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడట. ఈ ఘటనపై దర్యాఫ్తు ముందుకు సాగకుండా ఇరాక్ ప్రభుత్వాన్ని ఇజ్రాయెల్ సైన్యం నిరోధించగలిగిందని 'వాల్‌స్ట్రీట్ జర్నల్' పేర్కొంది. అయితే ఆ దాడిలో అమెరికా ప్రమేయం లేదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
మీ బిడ్డను ముద్దాడే ముందు వారి గురించి ఆలోచించండి.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీకి ఇరాన్ ఎంబసీ చురక..
విజయ్ ప్రమాణ స్వీకారం.. వందేమాతర గేయం ఆరు చరణాలు ఆలపించి..